మన ఊరి విధ్యా వికాసం
కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!
🙏🏻ఆత్మీయ ఆహ్వానం🙏🏻
ఈ రోజు (12/1/19)సాయంత్రం 5గం కు కట్టావారిపాలెం శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో జరుగు స్వామి వివేకానంద 156 వ జన్మదిన వేడుక సభకు యువకులు, మహిళలు,పెద్దలు హాజరు కావలసిందిగా సాదరంగా ఆహ్వానించుచున్నాము.
“స్వామి వివేకానంద జీవిత విశేషాలు,సందేశం” అనే అంశంపై వక్తృత్వ పోటీ నిర్వహించి బహుమతులు ఇవ్వబడును.తమపిల్లలను ప్రోత్సహించాలని విఙప్తి.
ఇట్లు: మనఊరి వికాసం.
స్వామి వివేకానంద 156 వ జన్మదిన వేడుక

ఎన్.ఆర్.ఐ దావులూరి రాజేష్
విజేతలకు బహుమతి ప్రదానం చేయుచున్న ఎన్.ఆర్.ఐ దావులూరి రాజేష్

గ్రామ పెద్దలు
స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేయుచున్న గ్రామ పెద్దలు
“వివేకానంద స్పూర్తితో యువత దేశసేవ చెయ్యాలి”
స్వామి వివేకానంద స్పూర్తితో యువత గ్రామాలకు,దేశసేవ చేయాలని ఎన్.ఆర్.ఐ దావులూరి రాజేష్ అన్నారు. మండలంలోని కట్టావారిపాలెం గ్రామంలో స్థానిక మనఊరివికాసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన స్వామి వివేకానంద 156 వ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు బహుమతులు పంచారు.గ్రామ పెద్దలు బొక్కిసం సుబ్బారావు,రావెళ్ళ చెంచయ్య,ఆరికట్ల చిన్న వెంకటేశ్వర్లు,ఆరికట్ల వెంకటసుబ్బయ్య,రావెళ్ల వెంకటేశ్వర్లు,ముప్పరాజు హరిబాబు,ధర్మవరపు అజయ్ వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వక్తృత్వ పోటీల్లో పాల్గొన్న ఆరికట్ల సంజన,రావెళ్ల సాయి దీపిక,మందాడి శ్రావణ్ కుమార్,కట్టా విజయ,రామ ప్రియాంక,మామిళ్ళపల్లి శివ లకు బహుమతులు ప్రదానం చేసినారు.కార్యక్రమంలో మనఊరివికాసం కార్యకర్తలు కోటపాటి లక్ష్మినరశింహం, బక్కముంతల వెంకటరావు,కట్టా రవికుమార్,గంగరాజు నాగేశ్వరరావు,రావెళ్ళ కోటేశ్వరరావు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.















