కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!
“”నేర్చుకోవడానికి వయసు అడ్డు కాదు”
విద్య నేర్చుకోవడానికి వయో పరిమితి లేదని బలమైన కోరిక ఉంటే ఏ వయసు వారైనా విద్యార్థి కావచ్చని కమేపల్లి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల యిన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు నెప్పల శాస్త్రి అన్నారు. కొండపి పంచాయతి కట్టా వారిపాలెంలో స్థానిక మన ఊరి వికాసం ఆధ్వర్యంలో జరుగుతున్న స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.59 సం వయసున్న గుంటుపల్లి పద్మావతి విద్యార్థిగా చేరి ఆంగ్ల భాష నేర్చుకోవడం ప్రేరణ దాయకంగా ఉందని అభినందించారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు రావేళ్ల రమేష్, మామిళ్లపల్లి కృష్ణ, ఉపాధ్యాయులు వి. సురేష్, కె. మాధవ, కార్యకర్తలు కట్టా రాము, మామిళ్ళపల్లి శివ ప్రసాద్, అంగలకుర్తి వీరబ్రహ్మం, కుంచాల వెంకటరావు, విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇట్లు,
మనవూరి(విధ్యా)వికాసం