మన ఊరి విధ్యా వికాసం
కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!
ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు
స్పోకెన్ ఇంగ్లీష్, మనవూరివికాసం (1/6/2019)
“ప్రపంచ భాష ఆంగ్లం”
స్పోకెన్ ఇంగ్లీష్ – 27వ రోజు జరిగిన వర్కుషాప్ లో 37 మంది విద్యార్థులు పాలగ్నోన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్చంధ సేవ సంస్థ మనవూరివికాసం వాలంటీర్స్ మరియు గ్రామ పెద్దలకు , తల్లిదండ్రులకు , గ్రామ ప్రజలకు ఎంతో కృతజ్ఞతలు.
ఇట్లు,
మనవూరి(విధ్యా)వికాసం
“”విద్యార్థులు ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి””
పోటీలో రాణించి ఉన్నత పదవులు పొందాలంటే విద్యార్థులు ఆంగ్ల భాషలో పట్టు సాధించాలని డిప్యూటి తహశిల్ దారు మామిల్లపల్లి శ్రావణ్ కుమార్ అన్నారు. కొండపి పంచాయతి కట్టావారి పాలెం లో స్థానిక స్వచ్ఛంద సంస్థ మన ఊరి వికాసం ఆధ్వర్యంలో జరుగుతున్న స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ శిబిరంలో పాల్గొని విద్యార్థులకు సూచనలిచ్చారు.12సం వయసు పిల్లలతోపాటు 59సం వయసు మహిళలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆశ్చర్యంగా వుందన్నారు. ఇంగ్లీషు ఊపాధ్యాలు వి. సురేష్, కె. మాధవరావు మరియు నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ ఎం. వెంకటేశ్వర్లు, నెప్పల శాస్త్రి, రావెళ్ల వెంకటేశ్వర రావు, మందాడి సుబ్బారావు, బోడ్డపాటి రవి, బక్కముంతల వెంకటరావు పాల్గొన్నారు