మన ఊరి సంస్కృతి వికాసం

కలిసి నడుద్దాం..! కలిసి నడిపిద్దాం..!

“మన ఊరి వికాసం-హరేరామ ఏకనామం“

 శరన్నవరాత్రి దసరా ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు కార్యక్రమంగా ఈ రోజు(2/10/2019) శ్రీ శ్రీ శ్రీ కోదడరామస్వామి దేవాలయంలో శ్రీరామనామ ఏకాహం ( 1 వ తేదీ ఉదయం 7 గం నుండి 2 వ తేదీ ఉదయం 7 గం వరకు,24 గంటలు హరేరామ ఏకనామం) జరుగును కనుక యావన్మంది గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పరమ పూజ్యులు నామానంద బిరుదాంకితులు గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామి వారి ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రముఖ శాస్త్రీయ భజన పంతులు గారు శ్రీ చావా నాగేశ్వరరావు గారు మరియు వారి  శిష్య బృందాల చే నిర్వహించబడును.ఈరోజు జరిగే కార్యక్రమం ఖర్చు మొత్తాన్ని  గౌరవనీయులు శ్రీ ఈదర వీరయ్యగారు వారి  కుమారుడు చిరంజీవి అభిషేక్  జన్మ దినోత్సవం సందర్భంగా దేవాలయానికి విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబ సభ్యులు ఆ శ్రీరామచంద్రుడు ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రార్థిస్తూ గ్రామ ప్రజల తరఫున దేవాలయ నిర్వహణ కమిటీ తరఫున శ్రీ వీరయ్య గారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇట్లు: నిర్వహణ కమిటి.  🙏🏻.

మనఊరివికాసం.