మన ఊరి ఆరోగ్య వికాసం

గ్రామ ప్రజలకు ముఖ్య విఙ్ఞప్తి:
నమస్కారం.
రేపు (18/8/19) ఆదివారం ఉదయం 7 గం నుండి మన గ్రామంలో షుగరు, బిపి వైద్య శిబిరం ప్రారంభం అవుతుంది. డా. కృష్ణమోహన్ గారు రోగులను పరిక్ష చేస్తారు. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.
ఇట్లు: కట్టా రవికుమార్, అధ్యక్షుడు.
మనఊరి(ఆరోగ్య)వికాసం

WhatsApp Image 2019-08-18 at 3.27.09 AM

మన ఊరి వికాసం, 18 ఆగష్టు 2019

“శారీరక వ్యాయామం, ఆహార మార్పుతో షుగర్ వ్యాధి నియంత్రించవచ్చు”

క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేస్తూ ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రించవచ్చని ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కంకణాల కృష్ణమోహన్ తెలియజేశారు. కొండేపి పంచాయతీ కట్టావారిపాలెం గ్రామంలో స్థానిక స్వచ్ఛంద సంస్థ మన ఊరి ఆరోగ్య వికాసం నిర్వహించిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొని 64 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామ పెద్ద బొక్కసం సుబ్బారావు మాట్లాడుతూ డాక్టర్ కృష్ణ మోహన్ గారు మరియు మన ఊరి వికాసం కార్యకర్తలు గ్రామ ప్రజలకు స్వచ్ఛంద సేవ చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రావులపల్లి కోట రాజు,మానికొండ వెంకటేశ్వర్లు, రావెళ్ళ చెంచయ్య, వీరమోసు మస్తాను, విద్యార్థులు, మన ఊరి ఆరోగ్య వికాసం కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

@మనఊరివికాసం

ఫొటోస్