మన ఊరి ఆరోగ్య వికాసం

గ్రామ ప్రజలకు శుభవార్త:
మన గ్రామంలో షుగరు మరియు బి.పి వైద్య శిబిరం డా. కృష్ణ మోహన్ గారి ఆధ్వర్యంలో శుక్రవారం (31/5/19) నిర్వహించబడును. అందరూ సద్వినియోగం చేసుకొనవలసిందిగా విజ్ఞప్తి
ఇట్లు: మన ఊరి ఆరోగ్య వికాసం.

WhatsApp Image 2019-05-31 at 4.30.00 AM

మన ఊరి వికాసం, 31 మే 2018

“”ఉచిత వైద్య శిబరం””
కొండపి పంచాయతి కట్టావారిపాలెం గ్రామంలో స్థానిక స్వచ్ఛంద సంస్థ మన ఊరి (ఆరోగ్య) వికాసం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డా. కంకణాల కృష్ణ మోహన్ 55 మంది రోగులకు ఉచిత వైద్య సేవలందించారు. షుగర్, బీపీ రోగులు క్రమం తప్పకుండా వ్యాయామం, నడవటం చెయ్యాలని, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొక్కిసం సుబ్బారావు, మానికొండ వెంకటేశ్వర్లు, విరమోసు మాస్తాను, కార్యకర్తలు పాల్గొన్నారు.

@మనఊరివికాసం

ఫొటోస్