
మన ఊరి ఆరోగ్య వికాసం
గ్రామ ప్రజలకు శుభవార్త:
మనగ్రామంలొ ది:28/4/2019 ఆదివారం ఉదయం 7 గంటలకు షుగరు మరియు బి.పి వైద్య శిబిరం ప్రారంభించబడును.ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డా.కంకణాల కృష్ణ మోహన్ గారు రోగులను పరిక్షించెదరు. గ్రామ ప్రజలు ఈ సదవకాశం వినియోగించుకోవాలని విఙ్ఞప్తి చేయుచున్నాము.
ఇట్లు:మనఊరి(ఆరోగ్య)వికాసం
మన ఊరి వికాసం, 28 ఏప్రిల్ 2019


“గ్లుకోమాతో అంధత్వం”
గ్లుకోమా (కంటిలో నీటి కాసులు) వ్యాధిని అశ్రద్ధ చేస్తే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఒంగోలు మోడరన్ కంటి ఆసుపత్రి వైద్యులు డా.మారంరెడ్డి వెంకట రమణారెడ్డి అన్నారు.ఈ వ్యాధి కంటి నుండి మెదడుకు పోయే ఆప్టిక్ నరమునకు సంబంధించిన వ్యాధి అని,వ్యాధి సోకిన తరువాత వెంటనే గుర్తించి చికిత్స చేయించకపోతే రెండు నుండి మూడు సంవత్సరాలలో కంటి చూపు తగ్గి అంధత్వం సంభవించే ప్రమాదం ఉందని చెప్పారు.ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డా.కంకణాల కృష్ణ మోహన్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధితో బాధపడేవారు, కుటుంబంలో పెద్దలకు వ్యాధి సోకిన చరిత్ర ఉన్నవారికి ప్రమాదం పొంచి ఉందనీ వీరు కనీసం ఆరునెలలకు ఒకసారి కంటి పరిక్ష చేయించుకోవాలని అన్నారు.వీరు ఆదివారం మండలంలోని కట్టావారిపాలెంలో స్థానిక స్వచ్ఛంద సంస్థ మనఊరివికాసం నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొని 63 మందికి ఉచితంగా బిపి,షుగరు మరియు కంటిలో నీటి కాసుల పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి మందులు పంపిణీ చేసినారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొక్కిసం సుబ్బారావు,రావెళ్ల రమేష్,మానుకొండ వెంకటేశ్వర్లు, వీరమోసు మస్తాను,గ్రామ ప్రజలు,మనఊరిఆరోగ్యవికాసం కార్యకర్తలు,విద్యార్థులు పాల్గొన్నారు.
@మనఊరివికాసం
ఫొటోస్













