మన ఊరి ఆరోగ్య వికాసం

శుభవార్త.
కట్టావారిపాలెం గ్రామంలొ డా.కృష్ణ మోహన్ గారి ఆధ్వర్యంలొ ఆదివారం (31-మార్చి) ఉదయం 7గంటల నుండి 10గంటల వరకు షుగరు,బిపి వైద్య శిబిరం నిర్వహించబడును.ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసి కొన వలసిందిగా విఙ్ఞప్తి.
ఇట్లు: కార్యకర్తలు,మనఊరి(ఆరోగ్య)వికాసం

WhatsApp Image 2019-03-31 at 6.57.59 AM

మన ఊరి వికాసం, 31 మార్చి 2019

” 74 మందికి వైద్యసేవలు “
ఆదివారం(31-3-19.)మండలంలోని కట్టావారిపాలెం గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 74 మంది రోగులకు వైద్య సేవలు అందించారు.స్థానిక మనఊరివికాసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు,ప్రముఖ షుగరు వ్యాధి చికిత్సా నిపుణులు డా.కంకణాల కృష్ణ మోహన్ గారు రోగులకు ఉచితంగా వైద్య సేవలందించారు.ప్రధానమంత్రి జనఔషధశాల,ఒంగోలు వారు రోగులకు చౌకధరలకు మందులు పంపిణి చేశారు.పిమ్మట ఆరోగ్యానికి హానికరమైన ధూమపానం,మద్య పానం,ప్లాస్టిక్ వాడకం, బహిరంగ మలవిసర్జన వంటి దురలవాట్లకు దూరంగా ఉంటామని గ్రామ ప్రజలు,కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మానికొండ వెంకటేశ్వర్లు, బొక్కిసం సుబ్బారావు,రావెళ్ల రమేష్,కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫొటోస్

వీడియోస్