మన ఊరి ఆరోగ్య వికాసం
గ్రామ ప్రజలకు శుభవార్త:
ది:21/12/18 శుక్రవారం ఉదయం 7గంటలకు మన గ్రామంలో డా.కంకణాల కృష్ణ మోహన్ గారి ఆధ్వర్యంలో షుగరు మరియు బి.పి వైద్య శిబిరం నిర్వహించబడును. గ్రామ ప్రజలందరూ సద్వినియోగ పరచుకొనవలసిందిగా విఙ్ఞప్తి. @మనఊరిఆరోగ్యవికాసం
మన ఊరి వికాసం, 21 డిసెంబర్ 2018
“ఆహారం మార్చుకుంటే మధుమేహం తగ్గుతుంది”
బియ్యం,గోధుమ వంటి పిండి పదార్ధం ఎక్కువగా ఉండే ధాన్యాలకు బదులు పీచు పదార్ధం ఎక్కువగా ఉండే కొర్రలు,రాగులు,జొన్నలు వంటి ధాన్యాలతో అన్నం తిని శారీరక శ్రమ ఎక్కువగా చేస్తే షుగరు వ్యాధి, హృద్రోగాలు నియంత్రించవచ్చని ప్రముఖ షుగరు వ్యాధి చికిత్సా నిపుణులు,ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డా.కంకణాల కృష్ణ మొహన్ అన్నారు.శుక్రవారం కట్టావారిపాలెంలొ స్థానిక మనఊరి వికాసం స్వచ్ఛంద సంస్త నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొని 50 మంది రొగులకు ఉచిత వైద్య సేవలందించారు.ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు బొక్కిసం సుబ్బారావు, రావెళ్ల చెంచయ్య,గ్రామ ప్రజలు, మనఊరిఆరోగ్యవికాసం కార్యకర్తలు పాల్గొన్నారు.
@మనఊరివికాసం