మన ఊరి ఆరోగ్య వికాసం

ఆదివారం ఉదయం 8గంకు కట్టావారిపాలేం పాత గవర్నమేంటు పాఠశాల వద్ద ఉచిత గుండే జబ్బుల వైద్య శిబిరం ప్రారంభిచబడును. ఇట్లు, మనఊరి ఆరోగ్య వికాసం

ఒంగోలు అమృత హార్టు ఆసుపత్రి వైద్యులు , ప్రముఖ గుండే వ్యాధుల చికిత్సా నిపుణులు డా.కేశవ గారు రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఖరీదైన గుండే పరిక్షలు ఉచితంగా చేస్తారు

వైద్యశిబిరాలకు రూ.50, 000/- విలువైన మందులు విరాళంగా ఇస్తున్న దాతలు గరికిపాటి కృష్ణమోహన్ & మోహన్ ప్రదీప్ మేమోరీయల్ ట్రస్టు వారికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు.

మన ఊరి వికాసం, 9 ఆగష్టు 2018

“అమృత వారి ఉచిత వైద్య శిబిరం”
మండలంలోని కట్టావారిపాలేంలో ఆదివారం ఒంగోలు అమృత హార్ట్ ఆసుపత్రి వైద్యులు ఉచిత గుండే జబ్బుల వైద్య శిబిరం నిర్వహించి 160 మంది రోగులను పరీక్షించినారు.అందరికీ ఉచితంగా ఇ సి జి , ఎకో పరీక్షలు చేసినారు. స్థానిక మన ఊరి ఆరోగ్య వికాసం కార్యకర్తలు ప్రముఖ గుండే వ్యాధి వైద్య నిపుణులు డా.వల్లభాపురపు కేశవను ఘనంగా సన్మానించారు. డా.కేశవ మాట్లాడుతూ గ్రామీణ బీదలకు తమ ఆసుపత్రి నందు ఉచిత సేవలు చేస్తున్నామని , ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు.ముఖ్య అతిధి ఎన్.ఆర్.ఐ ఆరికట్ల వాసు గ్రామంలో జరుగు వైద్య శిబిరాల నిర్వహణకు రూ.2లక్షలు విరాళం ప్రకటించినారు. ఈ శిబిరంలో గుండే వ్యాధి వైద్య ప్రముఖులు డా.డి.సుధీర్ కుమార్ , డా.బి.శివఁన్నారాయణ, పి.ఆర్.ఓ లు ఎ.కిరణ్ కుమార్ , ఎన్.ఎల్.ప్రసాదు , అమృత ఆసుపత్రి సిబ్బంది , గ్రామ పేద్దలు బోక్కీసం సుబ్బారావు , మానికోండ వేంకటేశ్వర్లు , రావేళ్ళ చేంచయ్య ,కట్టా రమణయ్య , వీరమోసు మస్తాను , కార్యకర్తలు పాల్గోన్నారు

ఈ శిబిరంలో రోగులకు గరికిపాటి కృష్ణమోహన్ & మోహన్ ప్రదీప్ మేమోరీయల్ ట్రస్టు వారు ఉచితంగా మందులు పంపిణీ చేసినారు.

@మనఊరివికాసం

ఫొటోస్