మన ఊరి ఆరోగ్య వికాసం

మన ఊరి వికాసం, 18 మే 2018
“డా.కృష్ణమోహన్ గారు ఆదర్శ వైద్యులు”
ఓంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డా.కంకణాల కృష్ణమోహన్ గారు ఆదర్శ వైద్యులనీ రేండు సంవత్సరాలుగా తమ గ్రామ ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నారని గ్రామ పేద్దలు బోక్కిసం సుబ్బారావు, రావేళ్ళ చంచయ్య కోనియాడారు.
మండలంలోని కట్టావారిపాలేం గ్రామంలో ది:18-05-2018 శుక్రవారం ఉదయం 7గం నుండి 12గం వరకు స్థానిక మనఊరివికాసం అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన బీపీ మరియు షుగరు వైద్యశిబిరం జరిగింది. డా.కంకణాల కృష్ణమోహన్ గారు 58 మంది రోగులను ఉచితంగా పరీక్షించినారు. దేవి ఆసుపత్రి సిబ్బంది కే.రాజారావు , బి.మనోహర్ స్వచ్ఛందంగా సేవలందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పేద్దలు కట్టా సుబ్బారావు, మానికోండ వేంకటేశ్వర్లు, కార్యకర్తలు పాల్గోన్నారు.
@మనఊరివికాసం
ఫొటోస్









