మన ఊరి ఆరోగ్య వికాసం

మన ఊరి వికాసం, 9 మార్చి 2018

 

అన్నిసేవల్లో కల్లా మానవ సేవ ఉత్తమమైనదని, ముఖ్యంగా వైద్యులు సేవా ధృక్పధం కలిగి ఉండాలని ప్రవాస భారతీయుడు కొండపి మండలం  కట్టావారిపాలెం గ్రామస్థుడు డా.రావేళ్ళ రాజారావు అన్నారు.గ్రామంలో ప్రతినెలా జరుగుతున్న ఉచిత వైద్యశిబిర నిర్వహణకు రెండు లక్షలు విరాళం ప్రకటించినారు. మన ఊరి వికాసం కార్యకర్తలు గ్రామానికి చేయుచున్న నిస్వార్థ సేవను అభినందించినారు. గురువారం స్థానిక మన ఊరి వికాసం స్వఛ్ఛంద సంస్థ ఆధ్వర్యాన గ్రామ పెద్దలు బోక్కిసం సుబ్బారావు ,ఆరికట్ల రమణయ్య ,విరమోసు మస్తాన్ డా.రాజారావుని ఘనంగా సన్మానించినారు.ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయుడు మానికోండ నవీన్ ,లాయర్ చెంచురామయ్య, అనుమాల ప్రసాద్ ,మాగులూరి నాగరాజు ,రావేళ్ళ వెంకటేశ్వర్లు ,కట్టా సుబ్బారావు ,అంగలకుర్తి కొండయ్య ,గుంటపల్లి పద్మావతి ,మన ఊరి వికాసం కార్యకర్తలు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. డా.రాజారావు గారి సేవా నిరతికి గ్రామ ప్రజలు ధన్యవాదములు తేలిపినారు. డా.రాజారావు గారు ఆధ్యాత్మిక గీతాలు ఆలపించి గ్రామ ప్రజలను ఆశ్చర్య చకితులను చేసినారు.

 

“48 మందికి ఉచిత వైద్య పరీక్షలు”
కొండపి మండలం కట్టావారిపాలెం గ్రామంలో శుక్రవారం ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డా.కంకణాల కృష్ణమోహన్ గారు 48మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసినారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు పట్టణాలకు పరిమితం కాకుండా నెలకు ఒక్కరోజు గ్రామాల్లోని నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవ చేయాలని సూచించారు.స్థానిక “మనఊరి ఆరోగ్యవికాసం” స్వఛ్ఛంద సంస్థ ఆధ్వర్యాన జరిగిన వైద్య శిబిరంలో గ్రామ పెద్దలు బోక్కిసం సుబ్బారావు ,మానికోండ వెంకటేశ్వర్లు ,కార్యకర్తలు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

 

 

@మనఊరివికాసం

ఫొటోస్