మన ఊరి ఆరోగ్య వికాసం

ఫిబ్రవరి 9వ తేదీ శుక్రవారం ఉదయం 7గం కట్టావారిపాలెం నందు డా.కృష్ణమోహన్ గారిచే షుగర్ / బీపీ వైద్య శిబిరం నిర్వహించ బడును.గ్రామ ప్రజలు ఎక్కువమంది ఉపయోగించుకొన వలసిందిగా విజ్ఞప్తి. ఇట్లు:- మనఊరివికాసం కార్యకర్తలు.
మన ఊరి వికాసం, 9 ఫిబ్రవరి 2018
“వైద్యులు సేవా భావం కలిగి ఉండాలి”
ప్రజలు వైద్యులను దైవంగా భావిస్తారు కనుక రోగుల పట్ల వైద్యులు సేవాభావం కలిగి ఉండాలని డా.కంకణాల కృష్ణమోహన్ అన్నారు. మండలంలోని కట్టావారిపాలెంలొ శుక్రవారం జరిగిన వైద్యశిబిరంలొ 42 మంది రోగులకు ఉచితంగా వైద్యసేవ చేసినారు. స్థానిక స్వఛ్ఛంద సంస్థ మన ఊరి వికాసం ఆధ్వర్యాన జరిగిన షుగర్ ,బిపి వైద్య శిబిరంలో గ్రామ పెద్దలు బొక్కిసం సుబ్బారావు ,మానికొండ వెంకటేశ్వర్లు ,కార్యకర్తలు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
@మనఊరివికాసం
ఫొటోస్

