మన ఊరి రైతు వికాసం
కలిసి నడుద్దాం.! కలిసి నడిపిద్దాం.!

ప్రకృతి వ్యవసాయం
శ్రీ విజయ రాం గారి ప్రేరణతో మన గ్రామంలో రైతులు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం మీద ఆసక్తి చూపుతున్నారు.
గత 7 సంవత్సరాలనుండి శ్రీ శేషయ్య గారు(బి ఎస్ ఎన్ ఎల్) ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.
ముఖ్యంగా కూరలు, పళ్ళు, కొర్రలు సాగు చేయుచున్నారు. మన ఊరు రైతులు చూసి వచ్చారు.
మన గ్రామంలో కూడా ప్రకృతి వ్యవసాయం ప్రారంభిస్తున్నాము
@మనఊరి రైతు వికాసం,
కట్టావారిపాలెం





ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ – దాత

అత్యంత గౌరవనీయులైన శ్రీ రావెళ్ల వెంకటరావు గారు, (పున్నయ్య గారి)(అహమ్మదాబాద్) జూన్ 2వ తేది జరుగు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమానికి కృష్ణా జిల్లా పోయి వచ్చే రైతుల ప్రయాణం ఖర్చులు తాను మనఊరివికాసం తరఫున భరిస్తాననీ, ఇది రైతు సోదరులకు చాలా ఉపయోగపడుతుంది కనుక వారిని ప్రోత్సహించడమే తన ఉద్దేశ్యం అని తెలియచేసినారు.వారికి కట్టావారిపాలెం గ్రామ ప్రజల తరఫున,రైతు సోదరుల తరఫున,మనఊరి రైతు వికాసం తరఫున అనేక ధన్యవాదాలు. ఈ సదవకాశం ఎక్కువమంది రైతు సోదరులు ఉపయోగించుకోవాలని విఙ్ఞప్తి.
వివరాలకు ఆరికట్ల చిన్న రాఘవులు, కట్టా రాము గార్లను సంప్రదించ గలరు.
@మనఊరి రైతు వికాసం,కట్టావారిపాలెం

ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం రైతునిబ్రతికిస్తుందని, ఈ విధానంలో రైతుఆత్మహత్యలకు తావులేదని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు ,ఆంధ్రా పాలేకర్ మేకపోతుల విజయరాం తెలియచేశారు.ముఖ్యంగా రసాయనిక ఎరువులు వాడకం వల్ల భూమి నిస్సారం అవుతుందని,ఆ ఆహారం వల్ల ఎక్కువమంది ఆసుపత్రి పాలవుతున్నారనీ అన్నారు. మండలంలోని కట్టావారిపాలెంకు చెందిన మనఊరివికాసం కార్యకర్తలు వారిని హైదరాబాదులో కలిసినప్పుడు ప్రకృతి వ్యవసాయ అవసరాన్ని వివరించారు.తాను 2009 లో ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు సుభాష్ పాలేకర్,రాజీవ్ దీక్షితుల ప్రేరణతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాననీ,సేవ్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి వేలమంది రైతులకు శిక్షణ ఇస్తున్నానని తెలియచేశారు.క్రిష్ణా జిల్లా గూడూరు మండలంలోని పినగూడూరు సౌభాగ్య గోసదన్ లో జూన్1,2,3 తేదీల్లో రైతులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామనీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇట్లు
మనవూరి రైతు వికాసం





ఫొటోస్







