మన ఊరి సంస్కృతి వికాసం

కలిసి నడుద్దాం..! కలిసి నడిపిద్దాం..!

WhatsApp Image 2019-08-07 at 6.29.51 AM

“గర్భిణీలకు చీరలు పంపిణీ”

కొండపి మండలంలోని కట్టావారిపాలెంలో “మన ఊరి వికాసం” స్వచ్ఛంద సంస్థ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలోని గర్భిణి స్త్రీలకు సీమంతం వేడుక చేసి నూతన చీరలు బహూకరించారు. స్థానిక అంగనవాడి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమశాఖ పర్యవేక్షకురాలు బి.సుశీలా దేవి ముఖ్య అతిథగా పాల్గొని మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లలకు ముర్రు పాలు తప్పక ఇవ్వాలని కనీసం 6 మాసాలు వచ్చేంత వరకు తల్లిపాలు మాత్రమే తాగిస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెప్పారు. గ్రామ పెద్దలు బొక్కీసం ప్రమీళ, రావెళ్ల శేషమ్మ గర్భవతులకు పూలు, పళ్ళు, గాజులు, చీరలు బహూకరించారు. రాజకీయాలకు అతీతంగా మన ఊరి వికాసం కార్యకర్తలు ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గ్రామ పెద్దలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి కార్యకర్తలు పి. సాయిలీల, ఎ.అరుణ, అయాలు టి. ధనలక్ష్మి, అర్. రమణమ్మ, మన ఊరి వికాసం కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

మనఊరివికాసం.

 

ఫొటోస్