మన ఊరి ఆరోగ్య వికాసం

WhatsApp Image 2019-05-11 at 8.18.19 AM

"చలివేంద్రం", మన ఊరి వికాసం

“చలివేంద్రం ప్రారంభం”

అన్ని దానాల్లోకల్లా మంచినీటి దానం గొప్పదని కొండపి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వి.సాంబశివరావు అన్నారు. మండలంలోని కట్టావారిపాలెంలో స్థానిక స్వచ్ఛంద సంస్థ మనఊరివికాసం ఆధ్వర్యంలో ఏర్పాటైన చలివేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. రావణాసురుడు రాముని కన్నా ఎక్కువ ప్రతిభ ఉన్నప్పటికీ సంస్కారం లేకపోవడంతో దుష్టుడుగ చరిత్రకెక్కాడని కనుక ప్రతిఒక్కరికీ చదువుతో పాటు సంస్కారం ముఖ్యమని చెప్పారు.గ్రామ పెద్దలతో మాట్లాడుతూ ఎండలో తిరిగి వడదెబ్బకు గురికావద్దని,మంచినీళ్లు ఎక్కువగా తాగాలని సలహా యిచ్చారు.విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని చెప్పారు. ముఖ్యంగా యువత గ్రామంలో సేవాకార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందనీ అన్నారు.ఈ కార్యక్రమంలో కొండపి పంచాయతి కార్యదర్శి బిళ్ళా అంకయ్య,గ్రామ పెద్దలు మానికొండ వెంకటేశ్వర్లు,బొక్కిసం సుబ్బారావు, రావెళ్ళ రఘునాధ చౌదరీ,వీరమోసు మస్తాను, గ్రామ ప్రజలు,మనఊరివికాసం కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫొటోస్