మన ఊరి విధ్యా వికాసం

కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!

ఉచిత టైక్వాండో శిక్షణ

కరాటే/టేక్వాండో శిక్షణ, మనవూరివికాసం (15/5/2022)

ప్రియమైన విద్యార్ధిని, విద్యార్ధులకు శుభవార్త. గత రెండు సంవత్సరాల నుండి కరోనా కారణంగా ఆగిపోయిన కరాటే/టేక్వాండో శిక్షణ ఈ వేసవి సెలవుల్లో మరలా ప్రారంభం అవుతుందని తెలియజేయుటకు మిక్కిలి సంతోషిస్తున్నాము. ముఖ్యంగా విద్యార్ధులకు మానసిక, శారీరిక వికాసానికి దోహదపడే టేక్వాండో శిక్షణ ఆడపిల్లలకు, మగపిల్లలకు ఎంతో అవసరం. ఆత్మ విశ్వాసంతో పాటు శారీరిక ఆరోగ్యం, ధృడత్వం మెరుగు పడతాయి.జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన ప్రముఖ మాస్టర్స్ పర్యవేక్షణలో ఉచిత శిక్షణ జరుగుతుంది. కట్టావారిపాలెం శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో మే 15వ తేది ఆదివారం ఉదయం 7గం.కు శిక్షణా తరగతి ప్రారంభం అవుతుంది కనుక పాత,కొత్త విద్యార్ధులు అందరూ పాల్గొన వలసిందిగా విజ్ఞప్తి
ఇట్లు :- మన ఊరి విద్యా వికాసం, కట్టావారిపాలెం

ఫొటోస్