sriramanavami

March 3, 2019 admin 2 comments

శ్రీరామ నవమికి నైవేద్యంగా వీటిని సమర్పిస్తే….

త్రేతా యుగంలోని ఛైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. నవమి రోజే సీతారాముల కల్యాణం జరిగిందంటారు.
శ్రీరామ నవమికి నైవేద్యంగా వీటిని సమర్పిస్తే….
త్రేతా యుగంలోని ఛైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. నవమి రోజే సీతారాముల కల్యాణం జరిగిందంటారు. అంతే కాకుండా పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకున్న శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈ రోజేనని హిందువులు నమ్మకం.

ఉగాదితో ప్రారంభమయ్యే ఛైత్ర నవరాత్రుల సమయంలో హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను పాటిస్తారు. తొమ్మిదో తిథి నవమి రోజున కొన్ని ప్రాంతాల్లో సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం జరుపుతారు. అయితే నవమి రోజున జన్మ రాశులను బట్టి సీతారామచంద్రులకు నైవేద్యాన్ని సమర్పిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి హాయిగా ఉంటారు. జన్మ రాశిని బట్టి వివిధ రకాలను నైవేద్యాన్ని రాముడికి సమర్పించాలి.

మేష రాశి వాళ్లు నవమి రోజు నైవేద్యంగా దానిమ్మ పండు సమర్పిస్తే జీవితంలో అన్ని సమస్యల నుంచి బయటపడతారు.

వృషభ రాశికి చెందిన వారు రసగుల్లాను రామాలయంలో సమర్పిస్తే కోరికలు సిద్ధిస్తాయి.

నవమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే….

హిందువులు దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రధాన పండుగల్లో శ్రీరామ నవమి కూడా ఒకటి. చైత్ర శుద్ధ నవమి నాడు రాముడు జన్మించాడు. అలాగే అదే రోజు ఆయన కల్యాణం జరిగింది.
నవమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే….
శ్రీరామనవమి రోజున వేకువనే నిద్ర మేల్కొని తల స్నానం చేసి పసుపు రంగు వస్రాలు ధరించాలి. ఇంటిని శుద్ధిచేసి పూజామందిరాన్ని అలకరించుకోవాలి. అలాగే వాకిలిలో అందమైన ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే ప్రతిమలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి.శ్రీ సీతారామలక్ష్మణ సమేత ప్రతిమను కానీ లేదా కేవలం శ్రీరాముని ప్రతిమను గానీ పూజకు ఉపయోగించవచ్చు. అర్చన కోసం సన్నజాజి, తామర పుష్పాలు, నైవేద్యం కోసం పానకం, వడపప్పు, కమల ఫలాలు సిద్ధం చేసుకోవాలి.

పూజా సమయంలో శ్రీరాముడి అష్టోత్తరం, శ్రీరామరక్షా స్తోత్రం, శ్రీరామాష్టకం, శ్రీరామ సహస్రం, శ్రీమద్రామాయణంలోని శ్లోకాలను కూడా పఠించాలి. శ్రీరామ పట్టాభిషేకం అనే అధ్యాయాన్ని పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.ప్రసిద్ధి చెందిన శ్రీరాముని ఆలయాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యం. దేవాలయాల్లో పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర పూజ, సీతారామకల్యాణం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తే మనసులోని కోరికలు నెరవేరి సిరిసంపదలు చేకూరుతాయి.

అలాగే నవమి రోజున శ్రీరామదేవుని కథ వ్రతాన్ని ఆచరించడం మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో పూజ ప్రారంభించాలి. పూజ చేసేటప్పుడు మెడలో తులసి మాలను ధరించాలి. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీరామ నిత్యపూజ లాంటి పుస్తకాలను ముత్తైదువులకు దానం ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.

మన భద్రాద్రే… రెండున్నరేళ్లు రాముడి నివాసం

మానవ చరిత్రలోనే… పురుషోత్తముడిగా రాముడు ప్రసిద్ధిగాంచాడు. దాంపత్యమంటే వీరిదే అని చెప్పేంతలా సీతారాములు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారని, గౌరవించుకున్నారు. అందుకే వారు ఆదర్శదంపతులు అయ్యారు. శ్రీరాముడు పుట్టినరోజు, పెళ్లి రోజు కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగాయని అంటారు. అందుకే ఈ రోజున హిందువులకు పెద్ద పండుగ. రాముడు తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవసానికి వెళ్లాడు. ఆ వనవాసంలో రెండున్నరేళ్లు మన భద్రాద్రిలోనే గడిపాడని అంటారు. అందుకే ఆ భద్రాద్రి పుణ్యక్షేత్రంగా, దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. ప్రతి ఏడాది ఇక్కడ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. భ్రద్రాద్రి త్రేతాయుగంలో పెద్ద అటవీ ప్రాంతం. ఆ అటవీ ప్రాంతాన్ని పర్ణశాలగా పిలిచేవారప్పుడు. ఇక్కడే రాముడు ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని భార్య, తమ్ముడితో నివాసం ఉన్నాడు. రామాయణంలోని ముఖ్య ఘట్టం జరగడానికి నాంది పలికింది ఈ ప్రాంతంలోనే. ఈ కుటీరంలో ఉన్నప్పుడే లక్ష్మణుడు శూర్పనఖ ముక్కుచెవులు కోశాడు… సీతమ్మ బంగారు లేడిని చూసింది… రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు… తద్వారా రామరావణ యుద్ధానికి బీజం పడింది.

 

పర్ణశాలకు దగ్గర్లో ఉన్న దుమ్ముగూడెం ప్రాంతంలోనే అప్పట్లో రాముడు నలభైవేల మంది రాక్షసులను చంపాడని చెబుతారు. ఆ సమయంలో ఎగసిన దుమ్మువల్లే ఆ ప్రాంతానికి దుమ్ముగూడెం అనే పేరు వచ్చిందని చెబుతారు. అలాగే రావణాసురుడు సీతమ్మను ఎత్తుకు పోతున్నప్పుడు జటాయువు అడ్డు తగిలింది భద్రాద్రికి దగ్గర్లోనే. జటాయువు రెక్క తెగిపడిన ప్రాంతమే జటాయువు పాకగా తరువాత ఎటపాక గా మారినట్టు చరిత్రకారులు చెబుతారు. ఇక దగ్గరలోని ఉష్ణగుండల ప్రాంతం కూడా రాముడి చలవ వల్లే ఏర్పడిందట. రాముడు సీతమ్మ వారి దాహం తీర్చడం కోసం బాణం ఎక్కుపెట్టి భూమిలోకి వదులుతాడు. భూమిలోంచి వేడి నీళ్లు బయటికి వస్తాయి. ఆ ప్రాంతమే తరువాత ఉష్ణ గుండలగా మారిందట. ఇలా భద్రాద్రితో పాటూ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రామ పాద స్పర్శతో పునీత మైనవే. అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని ప్రతీతి.

నవమి రోజు రాముడి పట్టాభిషేకమా, కల్యాణమా?

నవమి రోజు రాముడి పట్టాభిషేకమా, కల్యాణమా?
త్రేతాయుగంలోని వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి. రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో జన్మించాడు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.
 

రామాయంలో కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంత వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు.

చైత్ర మాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శతృఘ్నలు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు ఏడో అవతారం రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు. ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీ.పూ 5114 జనవరి 10 న జన్మించి ఉంటారని భావిస్తున్నారు.

రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభా యాత్ర. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు.
 
 


రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖలు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం.

ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సధ్గతి కలిగిస్తాడనేది ఐతిహసాలు ఘోషిస్తున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు. శ్రీరామ నీ నామ మేమి రుచిరా; ఎంతోరుచిరా; మరి ఎంతో రుచిరా; అని కీర్తించాడు.

రామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు  అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట. అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట.

2 Comments on “sriramanavami

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *