మన ఊరి ఆరోగ్య వికాసం

గౌరవనీయులైన గ్రామ పేద్దలకూ , దాతలకు , స్వచ్ఛంద కార్యకర్తలకు విజ్ఞప్తి.
అక్టోబరు-7వ తేదీ , ఆదివారం ఉదయం 8గం నుండి మధ్యాహ్నం 3గం వరకు మన కట్టావారిపాలేంలో మేగా వైద్య శిబిరం నిర్వహించ బడునని తేలీచచేయుటకు సంతోషించుచున్నాము.షుగరు , బిపి , గుండే , నరాలు , మేదడు , పక్షవాతం , లివరు, గ్యాసు ట్రబుల్ ,ఎముకలు, కీళ్ళు , దంతాలు సంబంధిత ప్రముఖ వైద్య నిపుణులు శిబిరంలో పాల్గోంటారు. మన గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సుమారు 500 మంది వైద్య శిబిరంలో పాల్గొనవచ్చు. కనుక స్వచ్ఛంద కార్యకర్తల అవసరం ఎక్కువగా ఉన్నందున తమరు తప్పక పాల్గోని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయచున్నాము. ఇట్లు:- మనఊరి ఆరోగ్య వికాసం కార్యకర్తలు , కట్టావారిపాలేం
మన ఊరి వికాసం, 8 అక్టోబర్ 2018
కట్టావారిపాలేం ఎం.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో స్తానిక మనఊరి ఆరోగ్య వికాసం సంస్త ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరంలో 200 మంది రోగులను పరీక్షించినారు.ప్రకాశం సూపరు స్పేషాలిటి ఆసుపత్రి వైద్యులు డా.ఎం.హనుమంతరావు ,M.D , డా.కే.విష్ణు వర్ధన్, M. D , D.M , డా.రాకేష్, M.S డా .అమరనాధరేడ్డి, M.S(Ortho) మరియు దేవి ఆసుపత్రి వైద్యులు డా.కే .కృష్ణమోహన్,M.B ; B.S డా.చైతన్యశ్రీ MDS , MBA రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించి , ఉచిత మందులు పంపిణీ చేసినారు.వైద్య శిబిరంలో ముఖ్య అతిధిగా పాల్గోన్న సింగరాయకొండ సర్కిలు ఇన్పేక్టర్ పి.దేవప్రభాకర్ గారిని , తమ గ్రామానికి 3సం నుండి ఉచిత సేవ చేయుచున్న డా.కృష్ణ మోహన గారిని గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు.రోగులకు , కార్యకర్తలకు రాజీవ్ యూత్ మరియు వీరమోసు మస్తాను అల్పాహారం , భోజనం ఏర్పాటు చేసినారు.శ్రీ కామయ్య (కోండపి)గారు ఉచితంగా మంచినీళ్ళు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో గ్రామ పేద్దలు మానికోండ వేంకటేశ్వర్లు , రావేళ్ళ కోటేశ్వరావు , బోక్కిసం సుబ్బరావు , బోక్కిసం ఉపేంద్ర చౌదరి రావేళ్ళ రఘునాధ బాబు మరియు ఎన్ ఆర్ ఐ అంగలకుర్తి సుబ్బరామయ్య ,కోండపి ఎస్ ఐ అంబటి చంద్రశేఖర్ , మనఊరి ఆరోగ్య వికాసం కార్యకర్తలు, రావేళ్ళ రాజీవ్ యూత కార్యకర్తలు, విద్యార్ధినీ విద్యార్ధులు , గ్రామ ప్రజలు పాల్గోన్నారు.
@మనఊరివికాసం
ఫొటోస్













