మన ఊరి విధ్యా వికాసం
కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!
ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు
స్పోకెన్ ఇంగ్లీష్, మనవూరివికాసం (7/5/2019)
మన గ్రామంలో మనఊరివికాసం వారిచే ప్రారంభించబడిన ఉచిత స్పోకెన్ ఇంగ్లీషు శిక్షణకు తమ పిల్లలను పంపుతున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు. సాధారణ విద్యలో మంచి మార్కులు,ర్యాంకులు సంపాదింన వారు కూడా ఇంగ్లీష్ భాష పై పట్టు సాధించనిదే ఉన్నతమైన ఉద్యోగాలు,వృత్తుల్లో రాణించలేరు.కనుక 40 రోజులు క్రమంతప్పకుండా పిల్లలు శిక్షణకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. వారు శిక్షణలో నేర్చుకుంటున్న విషయాలు ప్రతిరోజూ అడిగి తెలుసుకోవాలి.అప్పుడే పిల్లలకు పునఃశ్చరణ జరిగి ఉత్సాహం పెరుగుతుంది.
తరగతిలో మొత్తం 30 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది.ఇప్పటికి 27 మంది చేరినారు.ఇంకా ముగ్గురినే చేర్చుకుంటారు.శ్రద్ధ ఉన్నవారు 8/5/19 అనగా బుధవారం చేరాలి.తరవాత అవకాశం ఉండదు.
ఇట్లు: మనఊరి విద్యా వికాసం