మన ఊరి విధ్యా వికాసం

కలిసి నేర్చుకుందాం.! కలిసి నేర్పుదాం.!

ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులు

WhatsApp Image 2019-05-06 at 9.35.27 AM

స్పోకెన్ ఇంగ్లీష్, మనవూరివికాసం (6/5/2019)

 “ప్రపంచ భాష ఆంగ్లం”

 ఆంగ్ల బాష ప్రపంచ భాష కనుక ఉద్యోగం,వ్యాపారం, పరిశోధన లాంటి రంగాల్లో ఉన్నత స్తాయికి ఎదగాలనకునే వారు ఆంగ్లభాషలో పట్టు సాధించాలని డ్రీమ్ ఇన్స్టిట్యూట్ ఆంగ్ల అధ్యాపకులు వి.సురేష్ అన్నారు.మండలంలోని కట్టావారిపాలెంలో సోమవారం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.స్థానిక మనఊరివికాసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్.ఆర్.ఐ ల ఆర్థిక సహాయంతో40 రోజులు జరుగు ఉచిత శిక్షణకు విద్యార్థులతో పాటు నిరుద్యోగులు, ఉద్యోగులు,గృహిణులు కూడా పాల్గొనవచ్చని ఆయన చెప్పారు.విద్యార్థి దశనుంచి సాధన చేస్తే ఆంగ్ల భాష సులభంగా నేర్చుకొవచ్నని, తప్పులైనా సరే బిడియాన్ని వీడి మాట్లాడుతూ ఉంటేనే స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మనఊరివికాసం కార్యకర్తలు జి.నాగేశ్వరరావు,కె.లక్ష్మి నరసింహం, కె.రాము, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫొటోస్