మన ఊరి ఆరోగ్య వికాసం
గ్రామ ప్రజలకు ముఖ్య విఙ్ఞప్తి:
కట్టావారిపాలెం నందు ఫిబ్రవరి -2వ తేదీ,శనివారం ఉదయం 7గంటల నుండి 11గంటల వరకు వైద్య శిబిరం నిర్వహించ బడును.10గంటల వరకు మాత్రమే పేర్లు నమోదు చేయబడును.తరువాత వచ్చిన వారికి అవకాశం ఉండదు.ఈ వైద్య శిబిరంలో షుగరు,బిపి చికిత్స నిపుణులు డా.కంకణాల కృష్ణమోహన్ గారు ,ఎముకలు,కీళ్లు, నరాల శస్త్ర చికిత్స నిపుణులు డా.పాలూరి ప్రదీప్ గారు మరియు దంతాలు,చిగుళ్ళ శస్త్రచికిత్స నిపుణులు డా.సి.హెచ్.చైతన్యశ్రి గారు రోగులను ఉచితంగా పరిక్షించెదరు.గ్రామ ప్రజలందరూ ఈ సదవకాశం వినియోగించుకోవాలని విఙ్ఞప్తి చేయుచున్నాము.
ఇట్లు:- మనఊరి(ఆరోగ్య)వికాసం
మన ఊరి వికాసం, 2 ఫిబ్రవరి 2019
“వైద్యం వ్యాపారం కాకూడదు”
వైద్యులకు సేవాదృక్పథం ఉండాలని,వైద్యసేవలు వ్యాపారం కారాదని అనేక సంవత్సరాలనుండి గ్రామ ప్రజలకు ఉచిత సేవ చేయుచున్న డా.క్రిష్ణ మోహన్ నేటి తరం వైద్యులకు ఆదర్శంగా కావాలని ప్రముఖ ఎముకలు,నరాల శస్త్రచికిత్స నిపుణులు డా.పాలూరి ప్రదీప్ అన్నారు.శనివారం మండలంలోని కట్టావారిపాలెం గ్రామంలో స్థానిక స్వచ్చంద సంస్థ మనఊరిఆరోగ్యవికాసం నిర్వహించిన వైద్య శిబిరంలో డా.కంకణాల కృష్ణమోహన్ గారితో కలిసి 98 మంది రోగులకు ఉచితంగా వైద్య సేవలందించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మానుకొండ వెంకటేశ్వర్లు, బొక్కిసం సుబ్బారావు,వీరమోసు మస్తాను,గ్రామ ప్రజలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
@మనఊరివికాసం