మన ఊరి ఆరోగ్య వికాసం

 

శ్రీ రావేళ్ళ వెంకటరావు గారు కట్టావారిపాలెం వచ్చినపుడు యోగ నేర్చుకునే పిల్లలకు మంచి సందేశం యిచ్చి అభినందించారు.బాల్యం నుండి తనకు గ్రామంలో మంచి రామాలయం నిర్మించాలనే కోరిక ఉండేదని తన బాల్య స్మ్రుతులను పిల్లలతో పంచుకున్నారు.
 
ప్రతిఒక్కరూ ముందు మంచి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకోవాలని, ఉన్నతమైన భవిష్యత్ కు   అదే మంచి మార్గమని చెప్పినారు.తదుపరి మనఊరివికాసం కార్యకర్తలు నిర్వహిస్తున్న వైద్య శిబిరం గురించి వివరాలు తెలుసుకుని మంచి సలహాలు, సూచనలు యిచ్చారు. కార్యకర్యకర్తలను అభినందించినారు.
వైద్యశిబిరానికి వచ్చే రోగులకోరకు కుర్చీలు. బల్లలు కోనమని రూ.25000/- విరాళంగా యిచ్చినారు.వారి విలువైవ సమయాన్ని పిల్లలతో,కార్యకర్తలతో గడిపి అన్నివధాలా ప్రోత్సాహాన్ని అందించినందుకు, ఆర్ధికసహకారం అందించినందుకు కట్టావారిపాలెం గ్రామ ప్రజల తరఫున అనేక ధన్యవాదములు తెలుపుతున్నాము 🙏🙏🙏
 
శ్రీ.రావెళ్ళ వెంకటరావుగారి ఆర్ధిక సహాయంతొ 60 కుర్చీలు , 6 బల్లలు వైద్యశిబిర నిర్వహణకు కొనుగోలు చేసినాము.మొత్తం కొనుగోలు,బాడుగ ఖర్చు కలిపి రూ.19400/- అయింది.

 

@మనఊరివికాసం

ఫొటోస్