మన ఊరి ఆరోగ్య వికాసం

మన ఊరి వికాసం, 14 ఏప్రల్ 2017

కట్టావారిపాలెంలొ 6వ మధుమేహ వైద్య శిబిరాన్ని ది.14-4-2017 న ఉదయం 7గంటల నుండి 12గంటల వరకు విజయవంతంగా నిర్వహించిన మనఊరివికాసం కార్యకర్తలు 👍

61 మంది రోగులకు ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డా.కె.కృష్ణమోహన్ ఉచితంగా సేవలందించినారు.

వైద్యో నారయణో హరిః అన్నట్లు కట్టావారిపాలెంలోని వృధులకు ప్రతినెలా ఉచిత వైద్య సేవలందింస్తున్న డా.కృష్ణమోహన్ గారికి గ్రామ ప్రజలు అనేక నమస్కారాలు తెలుపుతున్నారు.

వైద్య శిబిర నిర్వహణకు సహకారం ఆనందించుచున్న గ్రామ పెద్దలకు,దాతలకు,కార్యకర్తలకు పేరు పేరును మన ఊరి వికాసం కార్యకర్తలు ధన్యవాదములు తెలుపుతున్నాము.

భవిష్యత్ లొ మరింత ఎక్కువమంది గ్రామ ప్రజలకు వైద్యసేవలను కొనసాగించుటకు వీలుగా తగు సూచనలు యివ్వగలరని విజ్ఞప్తి చేయుచున్నాము.

వైద్య శిబిరాల నిర్వహణకు ఆర్ధికంగా సహకరించదలచినవారు ఆంధ్రా బ్యాంక్ కొండపి శాఖనందు తమ విరాళాలు జమ చేయగలరు.

A/C No:26381010037940, IFSC Code:ANDB0002638 Savings Account.


@మనఊరివికాసం

ఫొటోస్